Corporate Lady

0
కార్పొరేట్ లేడి
మధ్యతరగతి ఇంట్లో పుట్టిన నీతా క్లాసికల్ డ్యాన్సర్ కావాలనుకుంది. క...ానీ కాలేదు. అమ్మ కోరుకున్నట్లు చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుంది. కానీ కాలేదు. ‘ఫస్ట్ కార్పొరేట్ లేడి ఆఫ్ ఇండియా’ అనే విశేషణం పక్కన తన పేరు చూసుకోవాలని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ ఆమె కోరుకోకున్నా ఇలాంటివి ఎన్నో బిరుదులు అమె కోసం ‘క్యూ’ కట్టాయి. కడుతున్నాయి. ప్రైమరీ స్కూలు టీచర్‌గా మొదలైన నీతా అంబానీ ఇప్పుడు ఏడువందల కోట్ల ఆదాయానికి నిర్వాహకురాలు కావడం వెనుక భర్త ముఖేష్ పాత్ర కంటే ఆమె కార్యనిర్వాహణ నైపుణ్యమే ప్రధాన కారణం.

స్కూల్, హాస్పిటల్ వ్యవహారాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే నీతాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఫోర్లు, సిక్సర్ల వేళలలో చప్పట్లకు మాత్రమే ఆ ఇష్టం పరిమితమై పోలేదు. ముంబై ఇండియన్స్ జట్టు యజమానిగా ఆటగాళ్లలో ఒకరిగా మారిపోయారు.

బ్యాట్, బాల్ పట్టుకొని స్టేడియంలోకి దిగడం మినహా అన్ని నైపుణ్యాలను ఒంటబట్టించుకున్నారు. పెద్దింటి కోడలు నీనాకు ఇలాంటివి ఇబ్బంది కరమే అయినా, ఆ ఇబ్బందిలోని ‘హుషారు’ ‘చురుకుదనం’ తప్ప మనకెప్పుడూ ఆమెలో విచారం కనిపించదు.
గ్రేట్ ఉమన్.
See More