0
వేసవిలో ముఖారవిందానికి...
అసలే వేసవి కాలం. ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు తోడు వాహనాల కాలుష్యం. గంట బయటకు వెళితే చాలు ముఖం నల్లగా మారిపోతోంది అంటూ చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఈ వేసవికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ముఖారవిందాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.
* ఎండలో వెళ్లాల్సి వచ్చినపుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. గొడుగు పట్టుకెళితే మరీ మంచిది.
* నీరు ఎక్కువగా తాగండి. ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. కొబ్బరి నీరు తీసుకుంటే ఇంకా మేలు.
* స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండండి.
* సమయానికి భోజనం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. రోజూ రెండు రకాల పండ్లను తినండి. ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వండి.
* అలసిన చర్మానికి తిరిగి జవసత్వాలు రావాలంటే మంచి నిద్ర తప్పనిసరి. కంటి నిండా నిద్రపోతే చర్మం తాజాదనం సంతరించుకుంటుంది.
* దుమ్ము, కాలుష్యంకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతున్నట్లయితే రోజూ క్లీన్సర్లు ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేసుకోండి.
* రాత్రి పడుకునే ముందు మాయిశ్చర్ రాసుకోండి.
* వ్యాయామం మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. కాబట్టి క్రమంతప్పకుండా వ్యాయామం చేయండి. ఒంటికి చెమట వచ్చేలా జాగింగ్‌లాంటివి చేస్తే ఇంకా మంచిది.
* యోగా, ప్రాణాయామం చేయండి. ఇవి ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తాయి.
0Awesome Comments!