విత్తనం .... జీవితం ఒక యాపిల్ చెట్టు

0



* విత్తనం .... జీవితం ఒక యాపిల్ చెట్టుకు ఓ 20 పండ్లు ఉన్నాయనుకుందాం. ఒక్కో యాపిల్‌లో సుమారు 10 విత్తనాలుంటాయి. అంటే 200 విత్తనాలు. వాటన్నింటినీ నాటితే 200 యాపిల్ మొక్కలు వస్తాయా? ఊహు. రానేరావు. వాటిలో సగం మొలకెత్తాయనుకుందాం. మరి వంద యాపిల్ మొక్కల కోసం 2 ...వందల విత్తనాలను నాటడం ఎందుకు? వంద మాత్రమే నాటితే వాటిలో సగమే మొలకెత్తుతాయి కనుక. మన జీవితం యాపిల్ లాంటిదే. మనం వేసే ప్రతీ అడుగు ఒక విత్తనం లాంటిదే. ఒక యాపిల్ మొక్క రావాలంటే పది విత్తనాలను నాటాలి. ఇదే లా ఆఫ్ ది సీడ్.... విత్తన సూత్రం. ఇది తెలుసుకుంటే మనలో నిరాశా నిస్పృహలే ఉండవు. ఒక విజయం రావాలంటే పదిసార్లు ప్రయత్నించాల్సిందే. ఒక ఉద్యోగం సంపాదించాలంటే పది ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలి. ఒక మంచి ఉద్యోగిని ఎన్నుకోవాలంటే వంద మందిని ఇంటర్వ్యూ చేయాల్సిందే. అంతెందుకు ఒక వస్తువు కొనాలంటే నాలుగైదు షాప్‌లన్నా తిరిగి చూస్తాం. మంచి డ్రెస్ సెలక్ట్ చేసుకోవడానికి షాప్‌లోని డ్రెస్‌లు లేదా చీరలన్నీ చెక్ చేస్తాం. మరి అలా ప్రయత్నించగానే ఇలా విజయం రావాలంటే ఎలా? అదే షాప్ అతను ఒక డ్రెస్ చూపించగానే మనం సెలక్ట్ చేసుకోలేదని నిరాశపడి చూపించడం మానడు కదా. అందుకే విజయం రావడం లేదని మనం ప్రయత్నించడం మానడం కరెక్ట్ కాదు. ఈ విషయం అర్థం చేసుకుంటే విజయం అందుకునే వరకూ ప్రయత్నిస్తూనే ఉంటాం. గమ్యాన్ని చేరుకుంటాం.


నచ్చితే నలుగురికి చెప్పండి...నచ్చక పొతే వదిలి పడేయండి ....!