నవ్వాలో ఏడవాలో

0


 ఒక పిచ్చాసుపత్రిలో రోగులు ఎక్కువైపోయారు. -ఆసుపత్రిలో వైద్యులంతా కలిసి పిచ్చి కొంచెం నయమైన వారినైనా డిశ్చార్జి చేద్దామని నిర్ణయించుకున్నారు.
రోగులందరికీ ఒక పరీక్ష పెట్టాలనుకున్నారు.
- అందర్నీ కలిపి ఒక పెద్ద గదిలో కూర్చోబెట్టారు. ఒక డాక్టర్ వెళ్ళి గదిలో ఉన్న పెద్ద బ్లాక్ బోర్డు పైన నిజంగా తలుపేనా అనిపించేలాగా సుద్ద ముక్కతో అందంగా ఒక చిత్రం గీశాడు.
తరువాత ఒక డాక్టర్ అందర్నీ ఉద్దేశించి
-“మీలో ఎవరు వెళ్ళి ఆ తలుపు తెరుస్తారో వాళ్ళకు మంచి ఐస్‌క్రీం బహుమానంగా దక్కుతుందని” ప్రకటించాడు.-
అలా చెప్పడమే తరువాయి అందరూ ఒకరు మీద ఒకరు పోటీ పడుతూ వెళ్ళి బోర్డు మీద పడసాగారు.
డాక్టర్లందరూ ఒక్కసారిగా డీలా పడీపోయారు.
- కానీ ఒక్క వ్యక్తి మాత్రం కుర్చీలో ఒంటరిగా కూర్చుని మిగతా వాళ్ళని చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు.
డాక్టర్లు “హమ్మయ్య! కనీసం ఒకడైనా దొరికాడు” అనుకుని
-
ఆ రోగి దగ్గరకు వెళ్ళి.- ” ఏం బాబూ! అందరూ ఐస్‌క్రీం కోసం ఆ తలుపు తెరవడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు మాత్రం తీరిగ్గా కుర్చీలో కూర్చుని సరదా చూస్తున్నావు?”
“ఓ అదా! మీకో విషయం తెల్సా! దాని తాళం నా దగ్గరే ఉంది. అది తెలియక పిచ్చి వెధవలు తెగ ఆరాటపడిపోతున్నారు!!!!” అంటూ పగలబడి నవ్వసాగాడు.
డాక్టర్లకి మాత్రం నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు.
-