ఈ కవిత నాది కాదు ......! ఎవరిదో ....నాకు తెలియదు ...!

0
ఈ కవిత నాది కాదు ......! ఎవరిదో ....నాకు తెలియదు ...!
కాని ఫలితం వారికే చెందాలని కోరుకుంటూ ....!


--------------------------------------------
ఎదురుగా వసంతాలు వస్తున్నా విషాదాల వేడుకలా ఉంది. -
ఏమైందో తెలియదు ఎదమొత్తం నిప్పుల కొలువైంది.
-నువ్వులేక వెన్నెల సైతం కాల్చేస్తుంది.

తోడుగా ప్రపంచాలు వస్తున్నా శ్మశానాల మౌనంలా ఉంది.
ఏదారీ తోచదు నిండారా నిద్దుర కరువైంది.
-నువ్వులేక వేకువ సైతం కాటేస్తుంది.

-వేదన నిండిన కన్నులలో నీ నవ్వుల రూపం ఎలా నిలపను?
చీకటి పరిచిన దారులలో నీ చూపుల అర్ధం ఎలా వెతకను?
నెత్తురు చిదిమిన గుండెలలో నీ నిన్నటి గుర్తులు ఎలా దాచను? -
మోడై వాడిన ఆశలలో నా రేపటి బ్రతుకును ఎలా నడపను?

-నీతోడుగా కడదాకా నడవాలని కలగన్నా..కలనే కన్నా
నిజమయ్యే ప్రాప్తం లేదు. నువ్వులేక పాదం కదలదు.
నీ ప్రేమలో ప్రమిదై వెలగాలని అనుకున్నా..ఆర్పేస్తున్నా
ఒకటయ్యే మోక్షం లేదు..నువ్వులేక ప్రాణం నిలవదు.



Google